Athagaarintiki

Athagaarintiki

Bullet Bandi Laxman

Альбом: Athagaarintiki
Длительность: 4:43
Год: 2025
Скачать MP3

Текст песни

నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట్ల పడకుండా నేను వెళ్ళిపోతున్నానే
నువ్వు నాతో మాటాడలేవే అని ఎవరితో మాటకుండానే వెళ్ళిపోతున్నానే
నువ్వు ఈ లోకంలో లేనేలేవే అని నేనీలోకాన్ని వదిలేసి పోతున్నానే
నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి
నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి

పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే నీ పెదవుల సిరినవ్వై నే పూసే పోతానే
జిల్లేడు చెట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే నీ తలపై తలువాలు నే పోసేపోతానే
వెళ్ళిపోతున్న ఇల్లు ఇడుపును అంతా విడిచిమళ్ళొస్తానో రానో ఈ తోవలో నేనే నడిసి
బధురంగుండే నువ్వు మళ్ళొస్తానో రానో నవ్వు నన్ను చూసి ఒక్కసారి
నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి
నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి
నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి
నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి

పిడికిళ్లతో మన్నే నాపై పోస్తూవున్నారే తలువాలు ఒడిబియ్యలు నువ్వు పోసుకోవే
ఈ మన్ను పరుపుల నేనే పడుకుంటున్నానే ఆ పువ్వుల పరుపుల నువ్వు హాయిగా నిదరోయే
పైసా పైసా అన్నడు కదనే నిన్ను కన్న నాన్న ఆఖరికి కురిసేది ఆటన చిక్కల నానా
పరువు పరువు అంటూ తీస్తిరి గదనే పరుగు
ప్రాణం పోయినంక మోగేదే డప్పుల దరువు
ఉండదే నీకే హాని పిల్ల పాపలతోని హాయిగా బతుకే నువ్వు వందేళ్ళు