Ne Koraku (Deva Na Kanneru Thuduvumu)

Ne Koraku (Deva Na Kanneru Thuduvumu)

Davidson Gajulavarthi

Альбом: Dave Praise
Длительность: 5:55
Год: 2020
Скачать MP3

Текст песни

నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి
నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి
హృదయమంత వేదనతో నిండియున్నది
ఆదరణే లేక ఒంటరైనది
హృదయమంత వేదనతో నిండియున్నది
ఆదరణే లేక ఒంటరైనది
దేవా నా కన్నీరు తుడువుము
హత్తుకొని నన్ను ముద్దాడుము
దేవా నా కన్నీరు తుడువుము
హత్తుకొని నన్ను ముద్దాడుము యేసయ్య

పాపము చేసి నీకు దూరమయ్యాను
నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను
పాపము చేసి నీకు దూరమయ్యాను
నన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను
నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను
నీ మాటలను మీరి లోకాన్ని చేరాను
పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను
దేవా నా కన్నీరు తుడువుము
హత్తుకొని నన్ను ముద్దాడుము
దేవా నా కన్నీరు తుడువుము
హత్తుకొని నన్ను ముద్దాడుము యేసయ్య

నీ హృదయ వేదనకు కారణమైనాను
దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను
నీ హృదయ వేదనకు కారణమైనాను
దోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను
నను మన్నించుమా నా తండ్రి
నను మన్నించుమా నా తండ్రి