Anthayu Neeve

Anthayu Neeve

G Balakrishna Prasad

Длительность: 6:45
Год: 2006
Скачать MP3

Текст песни

వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ

అంతయు నీవే హరి పుండరీకాక్ష

కులమును నీవే గోవిందుడా
కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి

తలపును నీవే ధరణీధర
తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ
తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
అంతయు నీవే హరి పుండరీకాక్ష

తనువును నీవే దామోదర
తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన

వినికియు నీవే విట్ఠలుడా
వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
అంతయు నీవే హరి పుండరీకాక్ష

పుట్టుగు నీవే పురుషోత్తమ
పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ

ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా
ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ శ్రీరఘురామ శ్రీరఘురామ