Narayana

Narayana

G. Balakrishna Prasad

Длительность: 7:12
Год: 2005
Скачать MP3

Текст песни

నారాయణ నారాయణ నారాయణ నారాయణ

నారాయణ నీ నామమె గతి యిఁక
నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు నాకుఁ గొనసాగుటకు
నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు నాకుఁ గొనసాగుటకు
నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు నాకుఁ గొనసాగుటకు
నారాయణ నారాయణ నారాయణ నారాయణ

పై పై ముందట భవ జలధి
పై పై ముందట భవ జలధి దాపు వెనకఁ జింతా జలధి

చాపలము నడుమ సంసార జలధి
చాపలము నడుమ సంసార జలధి తేప యేది యివి తెగనీఁదుటకు
చాపలము నడుమ సంసార జలధి తేప యేది యివి తెగనీఁదుటకు
నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు నాకుఁ గొనసాగుటకు
నారాయణ నారాయణ నారాయణ నారాయణ

పండె నెడమఁ బాపపు రాశి అండఁ గుడిని పుణ్యపురాశి

కొండను నడుమఁ ద్రిగుణరాశి
కొండను నడుమఁ ద్రిగుణరాశి యివి నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
కొండను నడుమఁ ద్రిగుణరాశి యివి నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు నాకుఁ గొనసాగుటకు
నారాయణ నారాయణ నారాయణ నారాయణ

కింది లోకములు కీడునరకములు
కింది లోకములు కీడునరకములు అందేటి స్వర్గాలవె మీఁద

చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ వేంకటేశ వేంకటేశ
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ యందె పరమపద మవల మరేది