Notice: file_put_contents(): Write of 481 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Gaddar - Podusthunna Poddumeeda | Скачать MP3 бесплатно
Podusthunna Poddumeeda

Podusthunna Poddumeeda

Gaddar

Длительность: 5:50
Скачать MP3

Текст песни

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా

అదిగో ఆ కొండల నడమ తొంగి చూసే
ఎర్రని భగవంతుడెవడు సూర్యుడు
ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో
పోటీపడి నడుస్తుంది కాలం
ఆలా కాలంతో నడిచినవాడే కదిలిపోతాడు
ఓ పొడుస్తున్న పొద్దు వందనం వందనం
ఆ పొడుస్తున్న బలే బలే బలే బలే బలే బలే హ హ హ
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా
కోట్లాది ప్రాణమ బలే బలే బలే బలే బలే హ హ హ
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా
కోట్లాది ప్రాణమ కోట్లాది ప్రాణమ

ఓ భూతల్లి సూర్యుడిని ముద్దాడిన భూతల్లి
అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది
అమ్మా నువ్వు త్యాగాల తల్లివి త్యాగాల గుర్తువు
భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు
చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు
హా మా భూములు మాకేనని
బలే బాల బలే బలే బలే
మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా
తిరగబడ్డ రాగమా మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమ
బలే బలే బలే బలే బలే బలే బలే హ హ హ
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా
కోట్లాది ప్రాణమ

అమ్మా గోదావరి నీ వొడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారము
అమ్మా కృష్ణమ్మా కిల కిల నవ్వే కృష్ణమ్మా
అమ్మా మీకు వందనం
గోదావరి అలలమీద కోటి కళల గానమా
కృష్ణమ్మా పరుగులకు నురుగుల హారమా
హా మా నీళ్లు బలే బలే బలే బలే బలే
మానీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా
కన్నీటి గానమా కత్తుల కోలాటమా కన్నీటి గానమా
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమ
బలే బలే బలే బలే బలే బలే బలే హ హ హ
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమ
అదిగో ఆప్రకృతిని చూడు ఆలా అలుముకుంటుంది
ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి
ఆ పువ్వు ఆలా ఆడుతాయి
అదిగో పావురాలజంట నేనెప్పుడూ విడిపోనంటాది
విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా
వీడబోసిన గీతామా యెడలనిండా గాయమా
పువ్వు పుప్పొడిలా
బలే బలే బలే బలే బలే బలే హ హ హ
పువ్వు పుప్పొడిలా పవిత్రభాన్దామా పరమాత్మునిరుపమా
పవిత్రభాన్దామా పరమాత్ముని రూపమా
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమ
బలే బలే బలే బలే బలే బలే బలే హ హ హ
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా
కోట్లాది ప్రాణమ

అదిగో రాజులూ దొరలూ వలసదోరలు
భూమిని నీళ్ళని ప్రాణుల్ని సర్వస్వాన్ని చెరబట్టారు
రాజుల ఖడ్గాలకింద తెగిపోయిన శిరస్సులు
రాజరికం కత్తిమీద నెత్తురుల గాయమా
దొరవారి గడులల్లో బలే బలే బలే బలే బలే బలే
దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా
ఆంధ్రవలస తూటాలకు ఆరిపోయిన దీపమా
హా మా పాలన బలే బలే బలే బలే బలే బలే హ హ హ
మా పాలన మాకేనని మండుతున్న గోళమా
అమరవీరుల స్వప్నమా మండుతున్న గోళమా అమరవీరుల స్వప్నమా
మండుతున్న గోళమా అమరవీరుల స్వప్నమా
అమరవీరుల స్వప్నమా అమరవీరుల స్వప్నమా అమరవీరుల స్వప్నమా