Neelavanka Thongi
Ghantasala, P. Susheela
3:13ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు నీలోని ఆశలన్నీ నాకోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే నీలోని ఆశలన్నీ నాకోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే నీ చూపులో స్వర్గమే తొంగి చూసే నీ మాటలో మధువులే పొంగిపోయే నీ చూపులో స్వర్గమే తొంగి చూసే నీ మాటలో మధువులే పొంగిపోయే నాలోని ఆణువణువూ నీదాయెలే బ్రతుకంతా నీకే అంకితంచేయనా నీలోని ఆశలన్నీ నాకోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే నీ రూపమే గుండెలో నిండిపోయే నా స్వప్నమే నేటితో పండిపోయే నీ రూపమే గుండెలో నిండిపోయే నా స్వప్నమే నేటితో పండిపోయే ఉయ్యాల జంపాల ఊగేములే కలకాలం మనకు ప్రేమయే ప్రాణము ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు