Neelavanka Thongi
Ghantasala, P. Susheela
3:13పగడాల జాబిలి చూడు గగనాన దాగెను నేడు వేయి అందాల నా రాజు అందిన ఈరోజు ఎందుకులే నెలరేడు పగడాల జాబిలి చూడు గగనాన దాగెను నేడు కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు మనసు మనసూ గుస గుస లాడెను పెదవీ పెదవీ కువ కువ లాడెను మనసు మనసూ గుస గుస లాడెను పెదవీ పెదవీ కువ కువ లాడెను ఆకాశ దీపాలు శయనించేనూ నా కళ్ళు నీ కళ్ళు పయనించేను ఆకాశ దీపాలు శయనించేనూ నా కళ్ళు నీ కళ్ళు పయనించేను పగడాల జాబిలి చూడు గగనాన దాగెను నేడు కోటి అందాల నా రాణి అందిన ఈరేయి ఎందుకులే నెలరేడు బంగరు మమతలు పొంగులు వారెను కొంగులు రెండూ ముడివడి పోయెను బంగరు మమతలు పొంగులు వారెను కొంగులు రెండూ ముడివడి పోయెను గుడిలోని దేవుడు దీవించెనూ నా జడలోని పూవులు తిలకించెనూ గుడిలోని దేవుడు దీవించెనూ నా జడలోని పూవులు తిలకించెనూ పగడాల జాబిలి చూడు గగనాన దాగెను నేడు కోటి అందాల నా రాణి అందిన ఈరేయి ఎందుకులే నెలరేడు