Neelavanka Thongi
Ghantasala, P. Susheela
3:13మనసు పాడింది సన్నాయి పాట మనసు పాడింది సన్నాయి పాట కనులు ముకుళించగ... తనువు పులకించగా గగనమే పూల తలంబ్రాలు కురిపించగా. ఆ ఆ ... మనసు పాడింది సన్నాయి పాట జగమే కల్యాణ వేదికగా.సొగసే మందార మాలికగా జగమే కల్యాణ వేదికగా.సొగసే మందార మాలికగా తొలిసిగ్గు చిగురించగా.ఆ ఆ ఆ ఆ తొలిసిగ్గు చిగురించగా... నా అలివేణి తలవాల్చిరాగ మనసు పాడింది సన్నాయి పాట... చిలికే పన్నీటి వెన్నెలలోనా. పిలిచే విరజాజి పానుపుపైనా చిలికే పన్నీటి వెన్నెలలోనా. పిలిచే విరజాజి పానుపుపైనా వలపులు పెనవేసుకోగా.ఆ. వలపులు పెనవేసుకోగా ... నా వనరాజు ననుచేర రాగా మనసు పాడింది సన్నాయి పాట... మదిలో దాచిన మమతలతేనెలు. పెదవులపైనే కదలాడగా మదిలో దాచిన మమతలతేనెలు. పెదవులపైనే కదలాడగా పెదవులకందనీ మధురిమలేవో.ఓ.ఓ... ఆ. పెదవులకందనీ మధురిమలేవో . హృదయాలు చవిచూడగా మనసు పాడింది సన్నాయి పాట కనులు ముకుళించగ... తనువు పులకించగా గగనమే పూల తలంబ్రాలు కురిపించగా. ఆ... ఆ ... మనసు పాడింది సన్నాయి పాట సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: ఘంటసాల, సుశీల