Nuvvakkadunte
Chakri
5:17ఎక్కడ బడితే అక్కడ నువు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే ఎక్కడ బడితే అక్కడ నువు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే కంటికి ఎదురుగ ఎవరున్నా నీ రూపాన్నే చూస్తున్నా ఒంటిగ ఎక్కడ నిలుచున్నా నీ తలపుల్లోనే ఉన్నా వలపులు వలదని మనసే అంటున్నా కన్ను మిన్నే నిన్నేలే చూడాలంటుందే నిన్ను నాలో నాలోనే దాచాలంటుందే ఎక్కడ బడితే అక్కడ నువు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే పుస్తకాలు చదివానే ప్రేమచరితలెన్నో విన్నానే ప్రేమజంటలను కలిశానే ఈ ప్రేమ మహిమలేంటో అడిగానే ప్రేమంటే సముద్రమన్నారొకరు ప్రేమంటే అమృతమన్నారింకొకరు ఆ లోతుకు దూకాలనిపించే ఈ తీపిని చూడాలనిపించే ముప్పలు తప్పక తప్పవని తెలిసీ కన్ను మిన్నే నిన్నేలే చూడాలంటుందే నిన్ను నాలో నాలోనే దాచాలంటుందే ఎక్కడ బడితే అక్కడ నువు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే అనుభవజ్ఞులను కలిశానే నా గుండె బాధనంతా చెప్పానే సైకాలిజిస్ట్‌లను కలిశానే ఉత్తరాలు కూడ రాశానే నీ మనసుకు మార్గం జ్ఞానం అన్నారొకరు నీ వయసుకు భారం తప్పదు అన్నారింకొకరు అనునిత్యం ధ్యానం చేస్తున్నా ఎదమోయని భారం మోస్తున్నా తిప్పలు తప్పక తప్పవని తెలిసీ కన్ను మిన్నే నిన్నేలే చూడాలంటుందే నిన్ను నాలో నాలోనే దాచాలంటుందే ఎక్కడ బడితే అక్కడ నువు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే కంటికి ఎదురుగ ఎవరున్నా నీ రూపాన్నే చూస్తున్నా ఒంటిగ ఎక్కడ నిలుచున్నా నీ తలపుల్లోనే ఉన్నా వలపులు వలదని మనసే అంటున్నా కన్ను మిన్నే నిన్నేలే చూడాలంటుందే నిన్ను నాలో నాలోనే దాచాలంటుందే