Jalsa Jalsa
Baba Sehgal
4:19మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన మాట వరసకైనా తనకు చెప్పనంటూ గీటు దాటకన్నా లెక్క చేయనంటూ ఆమె గారి చెయ్యి జారి మనసు గాని పారిపోయిందా ఏమైనా రానందా రమ్మన్నా మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన సన్నాయిలా వినిపిస్తున్నవా చెవి కొరికి పోయే చిరుగాలులు జడివానలా అనిపిస్తున్నవా జడ పూల చాటున తడి ఊహలు ఇన్నాళ్లు నువ్వైనా చూసావటే నీక్కూడ ముద్దొచ్చే అందాలు ఇవ్వాళే నీకు తెలిసాయటే ఛి పాడు అనిపించు అర్ధాలు ఇంతలో ఇంతలా ఎంత వింత మార్పు వచ్చిందే నీలోన బాగుందే ఏమైనా మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన ఉయ్యాలకే ఉలుకొచ్చిందట ఒళ్లోంచి నువ్ దిగి వెళ్లావని పట్టీల అడుగే అలిగిందట చెట్టెక్కడం మానుకున్నావని పైటొచ్చి నీ జట్టు కట్టుకుందని ఆటాడే ఈడింక చేరనన్నది పారాణికేమంత బరువుందని పాదాన్ని పరిగెత్తనీయకున్నది గుండెలో గువ్వలా పెంచుకున్న నిన్ను పిలిచిందే ఓ మేనా పంపాలే ఏమైనా మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన మాట వరసకైనా తనకు చెప్పనంటూ గీటు దాటకన్నా లెక్క చేయనంటూ ఆమె గారి చెయ్యి జారి మనసు గాని పారిపోయిందా ఏమైనా రానందా రమ్మన్నా మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన