Ayyayyo

Ayyayyo

Rahul Sipligunj

Альбом: Mem Famous
Длительность: 3:42
Год: 2014
Скачать MP3

Текст песни

అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏవయ్యింది గుండెలోన
నాకు నచ్చిన నా పిల్ల
నాతోనె నడవంగ
ఆగమాయే లో లోనా
తన మాటలు చెక్కెరలా
బుక్కినట్టు మస్తుంది లో లోపల
ఎంతుండాలో అంతలా
తియ్యగుంది తన సోపతిలా
అరె రోజులేని ఓ అలజడేదో
పుట్టే గుండె లోతుల్లోన
అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏవయ్యింది గుండెలోన
నాకు నచ్చిన నా పిల్ల
నాతోనె నడవంగ
ఆగమాయే లో లోనా

ఏడు రంగులు నీ నవ్వులొక్కటే
ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే
ఆ మబ్బుల వర్షం లాంటిదే
మన జంటనే
ఎప్పుడొస్తావంటూ ఎదురు చూస్తనే
ప్రతి గంటను ముందుకు తోస్తనే
ఒక్కసారి కంటి ముందు నువ్వుంటే
కాలాన్ని ఆపేస్తనే
మనసు మనసులా ఉండదే నువ్వొదిలెల్లక
బండరాయిలా బీరిపోత ప్రతి రోజలా
అరె నాకై నువ్వు నీకై నేను
పోదాం పద పై పై కలా
అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏవయ్యింది గుండెలోన
నాకు నచ్చిన నా పిల్ల
నాతోనె నడవంగ
ఆగమాయే లో లోనా

ఒట్టేసి నే సెప్పలేనులే
నువ్వు ప్రాణం కన్న నాకు ఎక్కువే
నా మాటల్లోన ప్రేమనెతికితే
ఎట్ల తెలుపనే
నీ కండ్లకు కవితలు సాలవే
నీ సూపుకు వంతెన వెయ్యవే
ఇట్ల రాలిపోని కొత్త పువ్వలే
ఎట్లా పుట్టావే
ఓణీ సొగసులో పడిపోయా
మాయదారి పిల్ల
ఏమందం సరస్సువే
నువ్వే నా మల్లె పూలమాల
అరె రోజు లేని ఓ అలజడేదో
పుట్టె గుండె లోతుల్లోనా
అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏముందిర ముద్దుగుమ్మ
కంటి కింద కాటుకెట్టి
కన్ను కొట్టగానే
కింద మీద ఆయే జన్మ