Mee Intiki Mundhu
Sagar
3:50భూమే గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా సూర్యుడికా వెలుగేంటి అని క్వశ్చన్ గాని వేశావా చిరుగాలీ కన పడవేంటని ఎపుడైనా ప్రశ్నించావా ఇది వరకు నడిచిన దూరం ఎంతని కొలిచావా కాలానికి వయసెంతా అని ఆరా తీశావా ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా పోయేది ఏమీలేదు ఛోడ్ దో లోలీటా సెన్యో రీటా లైఫే ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంటా లోలీటా సెన్యో రీటా అంచేతే కానిచ్చేద్దాం ఆటాపాటా ఒక మనిషికి ఒకటే మెదడు ఎందుకు ఉందో అడిగావా గుండెకు ఆ లబ్ డబ్ సౌండ్ ఏంటని క్వశ్చన్ చేశావా కనుబొమ్మలు కలిసేలేవని కొంచెం కన్ ఫ్యూజ్ అయ్యావా నీ తల్లో మెమరీ సైజు ఎన్ని బైట్లో ప్రశ్నించావా దోమలది ఏ బ్లడ్ గ్రూప్ అని గూగుల్లో వెతికావా స్వీటెందుకు ఇష్టం నీకని చీమని అడిగావా ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా పోయేది ఏమీలేదు ఛోడ్ దో లోలీటా సెన్యో రీటా లైఫే ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంటా లోలీటా సెన్యో రీటా అంచేతే కానిచ్చేద్దాం ఆటాపాటా ఆల్ఫాబెట్ లు ఇరవైఆరే ఉన్నాయేంటని అడిగావా రోజుకు ఓ యాభైగంటలు లేవేంటని ఫీలయ్యావా ఫోనెత్తి హల్లో ఎందుకు అంటాం ఆలోచించావా అగరొత్తికి దేవుడికి లింకేంటో రీసెర్చ్ చేశావా రెయిన్ బోలో బ్లాక్ అండ్ వైట్ ఎందుకు లేవన్నావా నిద్దర్లో కలదేరంగో రీవైండ్ చేశావా ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా పోయేది ఏమీలేదు ఛోడ్ దో లోలీటా సెన్యో రీటా లైఫే ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంటా లోలీటా సెన్యో రీటా అంచేతే కానిచ్చేద్దాం ఆటాపాటా సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి