Vaana Vaana

Vaana Vaana

S.P. Balasubrahmanyam

Альбом: Gang Leader
Длительность: 4:33
Год: 2014
Скачать MP3

Текст песни

వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
ప్రియుడి శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం (పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం)
హోం తొలకరి చిటపట చినుకులలో మకరందం  (చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం)
చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే (కొండకోన తుళ్లిపోయే)

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా (ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా)
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల (బిగిసిన కౌగిట కరిగించెను పరువాల)
కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
ప్రియుడి శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి
ల ల ల ల ల ల లా  (ల ల ల ల ల ల లా ) ల ల ల ల ల ల లా