Neelala Ningilo

Neelala Ningilo

S P Balasubramaniam

Альбом: Jebudonga
Длительность: 3:15
Год: 1975
Скачать MP3

Текст песни

నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో (మేఘాల తేరులో )

నింగికి నీలం నీవై నేలకు పచ్చను నేనై
రెండూ కలిసిన అంచులలో రేపూ మాపుల సంధ్యెలలో
ఎర్రని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా
ఎర్రని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా
మెల్లగా చల్లగా ముద్దగ మెత్తగ హత్తుకుపోయి
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో మేఘాల తేరులో

హిమగిరి శిఖరం నేనై నీ మమతల మంచును నేనై
ఆశలు కాసే వేసవిలో తీరని కోర్కెల తాపంలో
శివపార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై
శివపార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై
ఉరకలా పరుగులా పరువంలోనా ప్రణయంలోనా
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో మేఘాల తేరులో అహ ఆహా ఆ ఆ ఆహా ఒహా ఒహా ఆ ఆ ఒహా