Vanajallu Gillutunte

Vanajallu Gillutunte

S.P.Balasubramanyam & S.Janaki

Альбом: Yamudiki Mogudu
Длительность: 4:43
Год: 1988
Скачать MP3

Текст песни

వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మ
నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మ
సన్న తొడిమంటి నడుముందిలే
లయలే చూసి లాలించుకో
ఓ వానజల్లు గిల్లుడింక తప్పదమ్మ
వంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మ
చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో
వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మ

వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో... వద్దు లేదు నా భాషలో
మబ్బుచాటు చందమామ సారె పెట్టుకో... హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే హోయ్ సోకితే కోరికన్నదే రేగదా
వడగట్టేసి బిడియాలనే, ఒడి చేరాను వాటేసుకో
వానజల్లు గిల్లుడింక తప్పదమ్మ
నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మ

అందమంతా ఝల్లుమంటే అడ్డుతాకునా... చీరకట్టు తానాగునా
పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా... జారుపైట తానాగునా
కొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే గొడుగేశాను తలదాచుకో
వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మ
నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టాగమ్మ
చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో