Aadela Rava

Aadela Rava

S.P.Balasubramanyam & Vani Jayaram

Альбом: Swarna Kamalam
Длительность: 6:58
Год: 1988
Скачать MP3

Текст песни

గురుః బ్రహ్మ గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

ఓం నమో నమో నమః శివాయ
మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్త మాంగతే నమః శివాయ
ఓం నమో నమో నమః శివాయ
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ

అందెల రవమిది పదములదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృతగానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా
సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా
అందెల రవమిది పదములదా
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్షమేఘమై వేణి విసురు వాయువేగమై
అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రసఝరులు జాలు వారేలా
జంగమమై జడమాడగా జలపాతగీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
అందెల రవమిది పదములదా
నయనతేజమే నకారమై
మనోనిశ్చయం మకారమై
శ్వాసచలనమే శికారమై
వాంఛితార్థమే వకారమై
యోచన సకలము యకారమై
నాదం నకారం
మంత్రం మకారం
స్తోత్రం శికారం
వేదం వకారం
యజ్ఞం యకారం
ఓం నమః శివాయ
భావమే భవునకు భావ్యము కాగా
భరతమే నిరతము భాగ్యము కాగా
తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళా
ప్రాణపంచమమే పంచాక్షరిగా పరమపదము ప్రకటించగా
ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృతగానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
అందెల రవమిది పదములదా