Nanne Nanne

Nanne Nanne

Tippu & Shalini Singh

Альбом: Gharshana-New
Длительность: 5:55
Год: 2004
Скачать MP3

Текст песни

చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

నన్నే నన్నే చూస్తూ
నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ
నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

నీకో నిజమే చెప్పనా
నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఎదో అల్లరి అది నిన్న మొన్న లేనిది
మరి ప్రేమో ఎమో ఒకటే హైరానా ఆ హా
వాహువహా వాహువహా ఏమిటంటారో ఈ మాయనీ
వాహువహా వాహువహా ఎవరినడగాలో ప్రేమేనా అని

నన్నే నన్నే చూస్తూ
నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ
నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల పెదాల వీణ
బిడియములెరగని గడసరి సొగసుకు
తమకము లెగసెను నరాలలోన హా లోనా

ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో
నా వాటం మొత్తం ఎంతో మారిందీ
ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ
ఓఓ ఓఒ ఓఓ
నన్నే నన్నే మార్చి
నీ మాటల్తో ఏమార్చి
ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్
కన్ను కన్ను చేర్చి
నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయ్

చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

మనసున అలజడి వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకి మైనా
కలలను నిజముగ ఎదురుగ నిలిపిన
వరముగ దొరికిన వయారి జాణా ఆ జాణా
ఈ లోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా నేడే పుట్టిందీ
నీ వల్లే ఇంతగా మారాలే వింతగా
నువ్వంటే నాకు పిచ్చే పట్టిందీ
లాలల్లా లాలల్లాల లాల లాల లాలల్లాల

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

నీకో నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఎదో అల్లరి అది నిన్న మొన్న లేనిది
మరి ప్రేమో ఎమో ఒకటే హైరానా ఆ హా
వాహువహా వాహువహా ఏమిటంటారో ఈ మాయనీ
వాహువహా వాహువహా ఎవరినడగాలో ప్రేమేనా అనీ
ప్రేమేనా అనీ
ప్రేమేనా అనీ
ప్రేమేనా అనీ