Kalamism Tribute Song
Charan Arjun
4:46పల్లవి గంగ డోలు ఘల్లుమన్నాదో నా జంగమయ్య యాదీకొస్తాడో అల్లి పూల కొమ్మ ఊగిందో నా పిల్ల గౌరి కళ్ళ దిరిగేనో ఆలమందా అరుపు ఇన్నానో నా మోతేవారి పిలిసీనట్టుందే సుట్టబట్టా ఎదురువడ్డాదో నా సక్కనమ్మే యెదలా మెదిలేనో ఎలదరియా ఎలదరియా నా ఇంటి జంగమయ్య ఎలదరియా ఎలదరియా ఆ మింటి సెందురయ్య ఎలదరియా ఎలదరియా నా కంటి ఎలుగు చాయ ఎలదరియా ఎలదరియా నీలోనే నిండిపోయా చరణం -1 ఎండల్లో ఎన్నెల్ల ఇస్కల్లో సెల్మల్ల ఎదలోన మెదులుతుందే అది తొవ్వల్లో పువ్వోలె తొలిజాము పొద్దోలే ఎదురువడతా ఉన్నాదే కొండల్ల కోయిల్ల కోనేటి కోవెల్ల గుండెల్ల ఎలసినాడే వరి సేలల్ల పాటల్లె సెరువుల్ల సేపల్లె మనసుల మెసిలీ నాడే జంగమయ్యా జాడే పార్వతమ్మ నీడే మాటలేవీ లేవే కన్నుల్లోన నువ్వే సింగిడంటి వాడే గొంగడేసి నాడే ఆపతేమీ లేదే సొపతే వాడే ఎలదరియా ఎలదరియా నా ఇంటి జంగమయ్య ఎలదరియా ఎలదరియా ఆ మింటి సెందురయ్య ఎలదరియా ఎలదరియా నా కంటి ఎలుగు చాయ ఎలదరియా ఎలదరియా నీలోనే నిండి పోయా చరణం - 2 నా ఇంటి గడపల్ల కుడికాలు పెట్టవే ఎదురు కట్నమిస్తనే ఇగ నాసేత తినిపించి మీ వోళ్ళ మరిపించి గుండెల్ల గుడి గడ్తానే నా కలత నిదురల్ల నా కలవరింతల్ల నీ పేరే తలసినానే ఇక నీ ఇంటి దీపాన్ని ఎలిగించె నా సేతినెన్నడు ఇడిసిపోకే తలన వున్న గంగే తప్పలేదే శివునికే తలపులైన వేరే పొల్లను నేను తలవలేనే ఇట్టమైన వాడే సుట్టమైతే సాలె జన్మకింక వేరే జంజాటాలు లేవే ఎలదరియా ఎలదరియా నా ఇంటి జంగమయ్య ఎలదరియా ఎలదరియా ఆ మింటి సెందురయ్య ఎలదరియా ఎలదరియా నా కంటి ఎలుగు చాయ ఎలదరియా ఎలదరియా నీలోనే నిండి పోయా"