Nava Manmathuda

Nava Manmathuda

Chitra

Альбом: Pelli Sandadi
Длительность: 4:11
Год: 2014
Скачать MP3

Текст песни

నవమన్మధుడా అతిసుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియా మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు

గోరు వెచ్చని ఊపిరి వెయ్యి వేణువులూదగా తొలి ముద్దు చిందించేనే

వీణమీటిన తీరుగ ఒళ్ళు జల్లని హాయిగా బిగి కౌగిలందించేనే

రతి రాగాలే శృతి చేశాడే జత తాళాలే జతులాడడే
తనువంతా వింత సంగీతమేదో పలికే
అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియా మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు
చెల్లి ఎవరే అతగాడు
తుళ్ళే నీ వయసుకు జతగాడు

వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపేనే నిలువెల్లా తారాడేనే

చాటు మాటుల చోటులో ఘాటు కోరిక లూపేలే ఒడి చేరి తలవాల్చేనే

జడ లాగాడే కవ్వించాడే నడుంఒంపుల్లో చిటికేశాడే
అధరాలతోనే శుభలేఖ రాసే మరుడే
చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకు జతగాడు
నవమన్మథుడా అతిసుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియా మాధవుడా
నువ్వు వలచిన ఆ ప్రియుడు