Meghale Takindi

Meghale Takindi

S. P. Balasubramaniyam & K. S. Chitra

Длительность: 4:25
Год: 1997
Скачать MP3

Текст песни

మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా
నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిషా
చెలరేగాలి రమ్మంది హలో అంటూ
ఒళ్లోవాలె అందాల అప్సరస

మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా
నవరాగంలో నవ్వింది ని మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిషా
అది నా శ్వాసలో చేరి హలో అంటూ అల్లేసింది
నీ మీద నా ఆశ

తొలిసారి నిను చూసి మనసాగక
పిలిచానే చిలకమ్మా మెలమెల్లగా
తెలుగంతా తీయంగా
నువ్వు పలికావే స్నేహంగా

చెలిమన్న వల వేసి నను లాగగా
చేరాను నీ నీడ చలచల్లగా
గిలిగింత కలిగేలా
తోలి వలపంటే తెలిసేలా
ఓ కునుకన్నా మాటే నను చేరాక
తిరిగాను తెలుసా ఏం తోచక
మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా
నవరాగంలో నవ్వింది ని మోనాలిసా

తొలి పొద్దు వెలుగంత చిరు వేడిగా
నిలువెల్లా పులకింత చిగురించగా
దిగులేదూ హాయేదో
గుర్తు చెరిపింది ఈ వింత

ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా
నిజమేదో కలయేదో మరిపించగా
పగలేదూ రేయేదో
రెండు కలిసాయి నే చెంత

ప్రేమంటే ఇంతే ఏమో మరి
దానంతు ఏదో చూస్తే సరి
మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా
నవరాగంలో నవ్వింది ని మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిషా
అది నా శ్వాసలో చేరి హలో అంటూ అల్లేసింది
నీ మీద నా ఆశ

మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా
నవరాగంలో నవ్వింది ని మోనాలిసా