Maya
Chowraasta
4:43సాగు బరువాయనా రైతా సేలు తేలబోయనా రైతా ఏరు కరువన్నదా రైతా ఎరువు ఖర్చున్నదా రైతా నీ తల్లి నేలమ్మ రైతా గొంతెండి మాడింది రైతా నీ గుండె పగిలింది రైతా నీ ఊరు సెలవంది రైతా సాగు బరువైందా రైతా నీకు సావే సులువైందా రైతా ||2|| బాధనే లేదు రైతా… మాకు సింతనే లేదు రైతా సెయ్యెత్తి సెల్యూట్ సెయ్యా నీది వీర మరణమైనా గాదు రైతా స్మారక స్థూపాలు కట్టా ఏమైనా త్యాగశీలివా నువ్వు రైతా బాధనే లేదు రైతా… మాకు సింతనే లేదు రైతా మాటిచ్చి మరిసిన మేము రైతా… నీ ఓటడగ వచ్చాము రైతా సిగ్గు ఎగ్గు ఇడ్సి రైతా మేము… సీటుకై వచ్చాము రైతా నోటుకో ఓటు రైతా కులముకో సీటు రైతా మట్టినే నమ్మిన రైతా… నిన్ను మట్టిలో కలిపాం రైతా సాగు బరువైందా రైతా నీకు సావే సులువైందా రైతా