Thiruveedhula

Thiruveedhula

G. Balakrishna Prasad

Длительность: 5:42
Год: 2004
Скачать MP3

Текст песни

తిరువీధుల మెరసీ దేవదేవుడు
తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను
తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను
తిరువీధుల మెరసీ దేవదేవుడు
దేవదేవుడు దేవదేవుడు

తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషుని మీద
తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషుని మీద
మురిపేన మూడవనాడు ముత్యాల పందిరిక్రింద
మురిపేన మూడవనాడు ముత్యాల పందిరిక్రింద
పొరినాలుగవనాడు పువ్వు కోవిలలోను
పొరినాలుగవనాడు పువ్వు కోవిలలోను

తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను
తిరువీధుల మెరసీ దేవదేవుడు
దేవదేవుడు దేవదేవుడు

గక్కన ఐదవనాడు గరుడునిమీద
యెక్కెను నారవనాడు యేనుగుమీద
గక్కన ఐదవనాడు గరుడునిమీద
యెక్కెను ఆరవనాడు యేనుగుమీద
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ తేరును గుర్రమెనిమిదవనాడు
యిక్కువ తేరును గుర్రమెనిమిదవనాడు

తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను
తిరువీధుల మెరసీ దేవదేవుడు
దేవదేవుడు దేవదేవుడు

కనుకపుటందలము కదిసి తొమ్మిదవనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
కనుకపుటందలము కదిసి తొమ్మిదవనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీవేంకటేశు డింతి అలమేల్మంగతో
యెనసి శ్రీవేంకటేశు డింతి అలమేల్మంగతో
వనితల నడుమను వాహనాలమీదను
వనితల నడుమను వాహనాలమీదను

తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను
తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను
తిరువీధుల మెరసీ దేవదేవుడు
దేవదేవుడు దేవదేవుడు