Manasu Gathi Inthey

Manasu Gathi Inthey

Ghantasala

Альбом: Prem Nagar
Длительность: 4:08
Год: 1971
Скачать MP3

Текст песни

తాగితే మరచిపోగలను తాగనివ్వదు
మర్చిపోతే తాగగలను మరువనివ్వదు

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే

ఒకరికిస్తే మరలిరాదు ఓదిటిపోతే మరిచిపోదు
ఒకరికిస్తే మరలిరాదు ఓదిటిపోతే మరిచిపోదు
గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదు
మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే

అంతా మట్టేనని తెలుసు
అదీ ఒక మాయేనని తెలుసు
అంతా మట్టేనని తెలుసు
అదీ ఒక మాయేనని తెలుసు
తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు
మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే

మరుజన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
మరుజన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్ష
దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష
మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
మనసు గతి ఇంతే