Situkesthe Poye Pranam, Pt.2

Situkesthe Poye Pranam, Pt.2

Hanmanth Yadav

Длительность: 5:54
Год: 2024
Скачать MP3

Текст песни

వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇష్టం
కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే నీకు రావద్దు కష్టం
సిటీకేస్తే పోయేటి ప్రాణానికి ప్రేమ సీక్కులు పెటీనవేందే
బండ తీరు ఉండేటీ నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే
ఆ దేవుని మీద మన్ను వోయా నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే నీ మీదే పానమయే
నువ్వు నా తోడు లేక పోయే నాకు సావన్న రాకపాయే
వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇష్టం
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే నీకు రావద్దు కష్టం

నీ మెడలోన మూడు ముళ్ళేసి వందేళ్లు నీతోనే ఉంటన్నగానీ
నీ మెడలోన మూడు ముళ్ళేసి వందేళ్లు నీతోనే ఉంటన్నగానీ
నీ తలమీద కుంకుమనయ్యి సావుల తోడొస్తనన్నానుగానీ
మాటను తప్పిన మన్నించవే నిన్ను ఇడిసివెట్టి ఎళ్ళిపోతున్ననే
ఆ దేవుణి మీద మన్నుపొయ్య నీ ప్రేమకు బాకీ లేదేందే
నేను లేకుంటే ఎట్లుంటవే మల్ల రానంటే ఏమైతవే
నేను లేకుంటే ఎట్లుంటవే మల్ల రానంటే ఏమైతవే
ఆ కండ్లు లేని దేవుడే నిన్ను నన్నూ ఎడబాపెనే
ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్నస్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం

దూరమైతున్ననే పిల్ల నీకు నిన్ను సూడాలనుందే నాకు
దూరమైతున్ననే పిల్ల నీకు నువ్వంటే సచ్చేంత ప్రేమనే నాకు
దూరమైతున్ననే పిల్ల నీకు  నీతోనే బతుకాలని ఉందే నాకు
బతుకంతా నీతోనే అనుకున్ననే ఏడు జన్మాలు నీతోనే కలగన్ననే
నా బతుకంతా నీతోనే అనుకున్ననే బ్రహ్మ రాతలాగా గీత ఇంతేనే
నేను లేకుంటే ఎట్లుంటవే మల్ల రానంటే ఏమైతవే
ఆ కండ్లు లేని దేవుడే నిన్ను నన్నూ ఎడబాపెనే
ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్నస్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం

నేను పుట్టిన నా ఈ మట్టికైనా పాణాలు ఇచ్చేటి రోజొచ్చెనే
నేను సత్తే గర్వంగా జెప్పుకోయే భారత జెండాను గుండెలగత్తుకోయే
అన్నాన్ని వెట్టేటి రైతన్నకే ఆకలితో సావు వచ్చినట్టు
భరతమాత తల్లి కోసమంటూ కొట్లాడుతూ పానమిచ్చినట్టు
నిలిసిపోతానే మీ గుండెలా కలిసిపోతున్న ఈ మట్టిలా సల్లగుండే నువ్వక్కడా సచ్చిపోతున్న నేనిక్కడా
నువ్వు లేకుంటే ఎట్లుంటనే మల్ల రానంటే ఏమైతనే ఆ కళ్ళు లేని దేవుడే నిన్ను నన్నూ ఎడబాపెనే