Emaindamma Eenadu
Hari Haran
3:13ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా మనసుని మరి మరి అడగనా నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా శిలలైనా చిగురించే చినుకంటి శ్రీమతీ తొలిసారీ తెలిసింది చెలిమి సంగతీ గగనాలే శిరసొంచే సుగుణాల పెన్నిధీ వరమల్లే దొరికావే మంచి పెనిమిటీ ప్రతి అణువు తెగబరువై నిన్ను వేడుకున్నదీ జతపడుతూ సగమైతే ఎంత వేడుకన్నదీ ఇన్నాళ్ళు ఇంతటి భారం అనిపించలేదుగా నన్నేలు బంగరు ద్వారం కనిపించలేదుగా ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా హృదయాంతరంగ శృంగారగంగ ప్రవహించె ప్రణయ పరవశంగా మృధుశృంగధార మధురామృతాలే జతిమధన మధుర మిధునమంతా వెలుగంటే పడదంటూ కసిరే కసిరేయిలో తొలిపొద్దై వెలిగావే ప్రేమబంధమా వలపంటే విషమంటూ ఉలికిపడే గుండెలో అమృతమై కురిశావే ప్రణయమధురిమా మెలకువనే కల అంటూ మూసుకున్న కళ్ళకీ ఒంటరిగా పయనిస్తూ దారి తప్పు కాళ్ళకీ సూర్యోదయం చూపావే నూరేళ్ళ కుంకుమా నా తీరమై నిలిచావే నా ఇంటి దీపమా ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా మనసుని మరి మరి అడగనా నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా