Prema Desam
Hema Chandra
4:35హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిది ఈ నిజం పెదవులు విడిరాకా నిలువవే కడదాకా జీవంలో బతకవె ఒంటరిగా లో లో ముగిసే మౌనంగా (ఓ ఓ ఓ) హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిది ఈ నిజం ఊహల లోకంలో ఎగరకు అన్నావే తేలని మైకంలో పడకని ఆపావే ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా తెలవారి తొలికాంతి నీవో బలి కోరు పంతానివో అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిది ఈ నిజం వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు చల్లని చూపులతో దీవెనలిస్తాడు అంతటి దూరం ఉంటే బ్రతికించే వరంవుతాడు చెంతకి చేరాడంటే చితి మంటే అవుతాడు హలాహలం నాకు సొంతం నువ్వు తీసుకో అమృతం అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిది ఈ నిజం