Mella Mellaga Neethone
Krishna Chithanya | Geetha Madhuri
4:28నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా గుండె లోపలా ఉండుండి ఏంటిలా ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా చూడాలి చూడాలి అంటూ నీ తోడే కావాలి అంటూ నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల ఇంతందం ఇన్నాళ్ళనుండి దాక్కుంటూ ఏ మూల ఉంది గుండెల్లోనా గుచ్చేస్తోంది సూదిలా పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది ఏంతో పొగడాలనుంధీ నిన్నే నిన్నే కొంచెం గమ్మత్తుగుంది కొంచెం కంగారుగుంది అంత చిత్రంగా ఉంది ఈ రోజు ఏమైందిలా నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా చంద్రుణ్ణి మింగేసిందేమో వెన్నెల్ని తాగేసిందేమో ఎంతెంతో ముద్దొస్తున్నాది బొమ్మలా తారల్ని ఒళ్ళంతా పూసి మబ్బులతో స్నానాలు చేసి ముస్తాబై వచ్చేసిందేమో దేవతా మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు మేఘాలందేసినట్టు ఉందే ఉందే నన్నే లాగేస్తున్నట్టు నీపై తోసేస్తున్నట్టు ఏంటో దొర్లేస్తున్నట్టు ఏదేదో అవుతోందిలా నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా గుండె లోపలా గువ్వల గుంపుల ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరె ఎం చేసావే నన్నిలా కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలీలా