Are O Jangama

Are O Jangama

Madhu Priya

Альбом: Are O Jangama
Длительность: 5:11
Год: 2024
Скачать MP3

Текст песни

నంది వాహన నాగభూషణ
దూష దోష నాష వినాశన
సృష్టికారణ నష్టహరణ
తమో రజో సత్వ గుణ విమోచన
మాఘ మాసమున కృష్ణ పక్షమున
చతుర్ధశి నడి జామురాతిరిన
మహాలింగమే ఉద్భవించెనట
బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట
సృష్టికి మూలం నీవని తెలిసీ
సాగిలవడి నీ మహిమకు మొక్కే
అదే మహాశివరాత్రై వెలిసెనట

అరె ఓ జంగమ విభూది లింగమ
పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ
అరె ఓ జంగమా మెడలో సర్పమ
బూడిద దేహమా సిగలో సందమామ
సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట
మాఘ మాసమున మళ్ళీ పుట్టావట
బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట
మహా శివరాత్రిగా మహిలో నిలిచావట
అరె ఓ జంగమ విభూది లింగమ
పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ
అరె ఓ జంగమా మెడలో సర్పమ
బూడిద దేహమా సిగలో సందమామప
తారరే తారరే రే హో హో తారరే తారరే రే
తారరే తారరే రే హో హో తారరే తారరే రే
నిదుర ఆహారం అన్ని మానేస్తాం
ఉండి ఉపవాసం చేస్తాం జాగారం
జ్ఞానం నీ నేత్రం నీదే నీ సూత్రం
మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం
జగమే నీ రూపం
రారరే తారరే రే హో హో రారరే తారరే రే
రారరే తారరే రే హో హో రారరే తారరే రే
అరె ఓ జంగమ విభూది లింగమ
పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ
అరె ఓ జంగమా మెడలో సర్పమ
బూడిద దేహమా సిగలో సందమామ
సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టవట
మాఘ మాసమున మళ్ళీ పుట్టవట
బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట
మహా శివరాత్రిగా మహిలో నిలిచావట
అరె ఓ జంగమా విభూది లింగమ
పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ
అరె ఓ జంగమా మెడలో సర్పమ
బూడిద దేహమా సిగలో సందమామ
రారరే తారరే రే హో హో రారరే తారరే
రారరే తారరే హో హో రారరే తారరే
ఆత్మ పరమాత్మ అంతా నీ ఆట
మాలో జీవుడిగా ఉన్నది నీవంటా
బ్రహ్మనే శిక్షించే చూపిర జగదీశా
సత్యమే జీవమనే చాటిన మహేశా
సుందర ఆకారా
రారరే తారరే హో హో రారరే తారరే
రారరే తారరే హో హో రారరే తారరే