Nagundemedha
Jai Srinivas
5:46నువ్వంటే ఇష్టమని నీతోనే చెప్పమని పెదవచ్చున తేనెలు చిలికే పాటైయింది ప్రేమ వెంటాడే నీ కలనీ నిజమయ్యేదిప్పుడనీ కన్నంచున నిన్నే వెతికే వెలుగైయింది ప్రేమ ఏ చోట నేనున్నా నీ పిలుపు వింటున్నా ఆ ఏ వైపు చూస్తున్నా నిన్నే పలకరిస్తున్నా కనుమరుగై నువ్వుంటే నిను చూడాలనిపిస్తుంది ప్రతి తలపు నీకోసం ఆహ్వానం అందిస్తుందీ ఎంతసేపు ఇలాగా నీతో ఊసులాడే సరాగమెంటో నలిగింది కాలం చాలా జాలిగా నిన్న లేని వసంతమెదో వంత పాడే స్వరాల వలలో వెలిగింది మౌనం మరో మాటగా లా లా లా లా లా లా లా లా లా మునుపెన్నడు తెలియని ఈ వరసేదో నీ వలనేగా తెల్లవారే తూరుపులోన పొద్దువారే పడమరలోన నీ స్పర్శ లాంటి ఏదో లాలనా గాలిమేన సవారీ పైన తెలిపోయె ఏ రాగ మైన నీ శ్వాస లాగే సమీపించేనా లా లా లా లా లా లా లా లా లా ప్రతి నిమిషం ఆరాటంగా నీకోసం నే చూస్తున్నా నువ్వంటే ఇష్టమని నీతోనే చెప్పమని పెదవచ్చున తేనెలు చిలికే పాటైయింది ప్రేమ వెంటాడే నీ కలనీ నిజమయ్యేదిప్పుడనీ కన్నంచున నిన్నే వెతికే వెలుగైయింది ప్రేమ ఏ చోట నేనున్నా నీ పిలుపు వింటున్నా ఏ వైపు చూస్తున్నా నిన్నే పలకరిస్తున్నా కనుమరుగై నువ్వుంటే నిను చూడాలనిపిస్తుంది ప్రతి తలపు నీకోసం ఆహ్వానం అందిస్తుందీ