Chigurakulalo Chilakamma
Ghantasala
3:08సొగసు కీల్జెడలదానా సోగ కన్నులదాన వజ్రాలవంటి పల్వరుసదాన బంగారు జిగిదాన సింగారములదాన లయవైన వయ్యారి నడలదాన తోరంపు కటి దాన తొణకు సిగ్గులదాన పిడుకిట నణగు నెన్నడుము దానా ఆ ఆ ఆ మురిపించే అందాలే అవి నన్నే చెందాలే మురిపించే అందాలే అవి నన్నే చెందాలే నా దానవు నీవేలే నీవాడను నేనేలే ఆ ఆ ఆ ఆ దరిచేర రావే సఖి నా సఖీ ప్రేయసి సిగ్గేల మరపించే మురిపాలే కరిగించే కెరటాలై. మరపించే మురిపాలే కరిగించే కెరటాలై. నిదురించే భావాలా కదిలించే ఈ వేళా ఆ ఆ ఆ ఆ అదే హాయి కాదా సఖా నా సఖా మురిపించే అందాలే అవి నన్నే చెందాలే చెలి తొలి చూపే మంత్రించెనే ప్రియ సఖురూపే మదినేలెనే చెలి తొలి చూపే మంత్రించెనే ప్రియ సఖురూపే మదినేలెనే ఇది ఎడపాటు కనలేని ప్రేమా ఇల మనకింక సురలోక సీమ ఇది ఎడపాటు కనలేని ప్రేమా ఇల మనకింక సురలోక సీమ ఇదే హాయి కాదా సఖా నా సఖా మురిపించే అందాలే అవి నన్నే చెందాలే అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో మధు మాధుర్యమే నిండిపోయే హృదయానందమే పొంగిపోయే మధు మాధుర్యమే నిండిపోయే హృదయానందమే పొంగిపోయే దరి చేర రావే సఖీ నా సఖీ మురిపించే అందాలే అవి నన్నే చెందాలే సాహిత్యం: శ్రీ శ్రీ