Rang De

Rang De

Ramajogayya Sastri, Ramya Behara, Rahul Nambiar, And Shivani

Альбом: A Aa
Длительность: 4:02
Год: 2016
Скачать MP3

Текст песни

నలుపు తెలుపున కాటుక కళ్ళకు
రంగు రంగు కలనిచ్చిందెవ్వరు
దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ
నిదుర మరచినా రెప్పల జంటకు
సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు
బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ

నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం

రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే
రంగ్ దే రే రంగ్ దే రే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే

ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ
నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం

నీలిమేఘం నెమలి పింఛం
రెంటికీ లేదు ఏమంత దూరం
ఒకటి హృదయం ఒకటి ప్రాణం
వాటినేనాడు విడదీయలేం

హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే

ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ

రామ బాణం సీత ప్రాణం
జన్మలెన్నైనా నీతో ప్రయాణం
రాధ ప్రాయం మురళి గేయం
జంట నువ్వుంటే బృందావనం

హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే
హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే

ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ