Apudo Ipudo

Apudo Ipudo

Siddharth

Альбом: Bommarillu
Длительность: 4:04
Год: 2006
Скачать MP3

Текст песни

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసినీ
మదిలో కదలా మెదిలే నా కలల సుహాసినీ
ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

తీపికన్నా ఇంకా తీయనైన
తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన
చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే
నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

నన్ను నేనే చాలా తిట్టుకుంటా
నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పకపోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా
ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడానంటే
నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే
ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే
అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి