Bhama Bhama

Bhama Bhama

S.P.Balasubramanyam & Anuradha Sriram

Альбом: Murari
Длительность: 4:30
Год: 2001
Скачать MP3

Текст песни

భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి హత్తుకోవాలి  సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి
భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు

తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా
తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా

ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై వుంటా సరదాగ
వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా
గుట్టంతా చూస్తానంటూ గుబులెట్టేస్తావా సారంగా
యమకారంగ మమకారంగ నిను చుట్టేస్తా అధికారంగా
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా

తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా
తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా తయ్యా

అబ్బోసి సొగసొగ్గేసి మహచెలరేగావే లగిలేసి
నిను చూసి తెగ సిగ్గేసి తలవంచేసా మనసిచ్చేసి
చుట్టేసి పొగ పెట్టేసి నను లాగేసావె ముగ్గేసి
ఒట్టేసి జత కట్టేసి వగలిస్తానయ్యా వలిచేసి
ఓసోసి మహముద్దేసి మతి చెడగొట్టావే రాకాసి
ఏదోచేసి మగమందేసి నను కాపాడయ్య దయచేసి
భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు
బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు
ముద్దు కావాలి హత్తుకోవాలి సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి
భామ భామ దా దా అమ్మడూ
బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు
భామ భామ

బావ బావ