Nuvvu Nenu

Nuvvu Nenu

S.P.Balasubramanyam

Альбом: Gangothri
Длительность: 4:52
Год: 2003
Скачать MP3

Текст песни

నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా
నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్విక్కడుండి నేనక్కడుంటె ఎంతో కష్టం

నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా
నువ్వక్కడుండి నేనిక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం

ఎగరేసిన గాలి పటాలే ఎద లోతుకు చేరుతాయని
రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని
తెగ తిరిగిన కాలవ గట్లే కథ మలుపులు తిప్పుతాయని
మనమాడిన గుజ్జన గూళ్ళే ఒక గూటికి చేర్చుతాయని
లాలించి పెంచిన వాడే ఇకపై నను పరిపాలిస్తాడని తెలిసాక
నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్విక్కడుండి నేనక్కడుంటె ఎంతో కష్టం
నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం

ఆ బడిలొ పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని
ఆ రైలు పట్టాలే పల్లకినె పంపుతాయని
రాళ్ళల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయని
ఆ బొమ్మల పెళ్ళిళ్ళే ఆశీస్సులు తెలుపుతాయని
తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని తెలిసాక
నువ్వక్కడుండి నేనిక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం
నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా
నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం