Priya Raagale
S.P.Balasubramanyam
6:06జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదా రేయి ఆపుమ జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ చిగురు పెదవిపైన చిరునవ్వై చేరాలనుకున్నా చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా ఉన్నమాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమకాంతి కనపడలేదా మరీ అంత దూరమా కలలు కన్న తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ మనసు చూడవమ్మా కొలువుందో లేదో నీ బొమ్మా మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమనీడ చేరుకోని పంతమా తోడుకోరి దగ్గరైతె దోషమా తీయ్యనైన స్నేహమంటె ద్వేషమా ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదా రేయి ఆపుమ జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా