Notice: file_put_contents(): Write of 626 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Sri - Jagamanta Kutaumbam | Скачать MP3 бесплатно
Jagamanta Kutaumbam

Jagamanta Kutaumbam

Sri

Альбом: Chakram
Длительность: 4:19
Год: 2005
Скачать MP3

Текст песни

జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

కవినై కవితానై భార్యనై భర్తనై
కవినై కవితానై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలా కన్నీటి జలపాతాల
నాతొ నేను అనుగమిస్తూ నాతొ నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతలా మంటను నేనై
రవినై ససినై దివమై నిషినై
నాతొ నేను సహగమిస్తూ నాతొ నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరినాల్ని హరినాల చరణాల్ని చరణాల
చలనాన కానరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

గాలి పల్లకీలోన తరలి నా పాటా పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తాను మూగబోయి నా గుండె మిగిలే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలీ
నా హృదయములో ఇది సినివాళి
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది