Po Indru Neeyaga (From "Velai Illa Pattadhaari")
Anirudh Ravichander
3:46అమ్మ అమ్మ నీ పసివాడనమ్మ నువ్వే లేక వాసి వాడనమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది యదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్నొదిలేసి ఎటు పోయావే అమ్మ ఇకపై నే వినగలనా నీ లాలి పాట నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావో అంతే చాలంట అమ్మ అమ్మ నీ పసివాడనమ్మ నువ్వే లేక వాసి వాడనమ్మ చెరిగిందే దీపం కరిగిందే రూపం అమ్మ నాపై ఎమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడి రేయి ముసిరింది కలవర పెడుతుంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మ అమ్మ నీ పసివాడనమ్మ నువ్వే లేక వాసి వాడనమ్మ వీడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరిచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచేనా కలతను రానీకు కన్నంచన కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరాలోన చిగురై నిను చేరానా అమ్మ అమ్మ నీ పసివాడనమ్మ నువ్వే లేక వాసి వాడనమ్మ అడుగై నీతోనే నడిచొస్తున్నా అద్దంలో నువ్వై కనిపిస్తున్నా అయ్యో వెళ్ళిపోయావే.. నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మ ఇకపై నే వినగలనా నీ లాలి పాట వెంనంటే చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా