Virisindhee Vasanthaganam

Virisindhee Vasanthaganam

Chitra

Альбом: Bhairava Dweepam
Длительность: 5:00
Год: 1994
Скачать MP3

Текст песни

విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా
విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా
మనసే మందారమై
వయసే మకరందమై
అదేదో మాయ చేసినది
విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా

ఝుమ్మంది నాదం రతివేదం
జతకోరే భ్రమర రాగం
రమ్మంది మొహం ఒక దాహం
మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని
ప్రవహించే ఈ వని
ప్రభవించే ఆమని
పులకించే కామిని
వసంతుడే చెలికాంతుడై
దరిచేరే మెల్లగా
విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా

ఋతువు మహిమేమో విరితేనే
జడివానై కురిసే తియ్యగా
లతలు పెనవేయ మైమరచి
మురిసెను తరువు హాయిగా
రాచిలుక పాడగా
రాయంచ ఆడగా
రాసలీలా తోడుగా
తనువెల్ల ఊగగ
మారుడే సుకుమారుడై
జతకూడే మాయగా
విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా
విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా
మనసే మందారమై
వయసే మకరందమై
అదేదో మాయ చేసినది
విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా
విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా