Notice: file_put_contents(): Write of 630 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Director - Booloka Swargama | Скачать MP3 бесплатно
Booloka Swargama

Booloka Swargama

Director

Альбом: Chakri
Длительность: 4:51
Год: 2013
Скачать MP3

Текст песни

భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా
పోలేక ఉండలేక కంటి నీడై నిలిచావా
ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వచ్చావా
అడుగడుగున బాధలతోటి బ్రతుకే పోటీ ఇచ్చావా
కన్నతల్లి చేతిముద్ద నేలపాలే చేసావా
అమ్మ కన్న మిన్న లేదు అన్న మాటే మరిచావా

చదువులకే చదువై నిలిచీ
అమ్మ కంటి వెలుగై మెరిసీ
పౌండుల్లో పవరే చూసీ
లండన్ నీ నవ్వే చేసీ
కన్నోళ్ళ తోడే విడిచీ
కని పెంచిన ఊరే విడిచీ
నేస్తాలా స్నేహం విడిచీ
నీ మట్టికి దూరం నడిచీ
పై చదువుల కోసం నువ్వు పయనం అయ్యీ వచ్చావా
నీ మేధకు సమాధి కట్టే మోసానికి బలి అయ్యావా
ప్రాణమల్లే ఉన్న చదువునీ పార్ట్ టైముగా మార్చావా
బాధల్లో ఉన్నా గానీ బాగున్నానని అన్నావా

అవకాశాలెన్నో ఉన్నా నీ కోసం చూస్తూ ఉన్నా
అందనిదే గొప్పని నమ్మీ ఆస్తిపాస్తులన్నీ అమ్మి
ఊహల్లో మేడలు కట్టీ ఫారిన్లో అడుగే పెట్టీ
పరువంతా పక్కన పెట్టీ కూలీల వేషం కట్టీ
అవమానాలెన్నో మోస్తూ అన్నీ చేస్తూ ఉన్నావా
జీవితమే జీతం తోటి తూకం వేస్తూ ఉన్నావా
ఎండమావి నీళ్ళ కోసం ఎడారిలోనా వెతికావా
ముళ్ళదారిలోన నువ్వు గాయమయ్యీ నిలిచావా

రక్తాన్నే పంచిన తల్లీ రాఖీని కట్టిన చెల్లీ నువ్వాడీ పాడిన గల్లీ చూస్తున్నవి నీకై మళ్ళీ
ఎదిగొచ్చిన బిడ్డల కోసం ఎరలిచ్చె ఆప్తుల కోసం
గూడొదిలిన గువ్వల కోసం గుర్తొచ్చే నవ్వుల కోసం
చూస్తున్నది గగనం నిండా ఎగిరే జెండా రమ్మంటూ
వీస్తున్నది దేశపు గాలీ ఝండా ఊంచా అనమంటూ
ఓ సచినూ కలాము కూడా ఫారిను పౌండే దిక్కనుకుంటే
ఈ ఎత్తుకు ఎదిగే వారా దేశం ఖ్యాతిని పెంచేవారా
నిజం తెలుసుకో నీ రుణం తీర్చుకో
భారతీయుడై భువిని గెల్చుకో

వందెమాతరం వందెమాతరం వందెమాతరం వందెమాతరం
వందెమాతరం వందెమాతరం వందెమాతరం వందెమాతరం