Prema Majili
Dilip Devgan
5:39నీ కలువానీ కన్నుల్లోన వరుడే ఎవరమ్మా నీ బుగ్గల్లో సిగ్గులనే గెలిచాడోయమ్మా నీ తోడయ్యే వాడు ఎవరో నువ్వే సెప్పమ్మా నడి రాతీరి చంద్రుడు ఎవడయ్యడోయెమ్మా రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుంది తన నిదురను దోచేసే రూపం నీదయింది రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుంది నా నిదురను దోచేసే రూపం నీదయ్యింది నేనెందరిలో ఉన్నా నా సుందరి కనపడుతుంది ఎద హత్తుకునే సమయం రానే వచ్చేసింది ఏడడుగుల జీవితమో ఎద పలికే సంగతమో ఏ జన్మలో పుణ్యమో ఏ నాటిదో ఈ బంధమో నీతోడే కావాలి గడిసేటి గడియైన నీ చెయ్యే వదలనులే చావైనా బతుకైనా రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుంది తన నిదురను దోచేసే రూపం నీదయ్యింది స రి గ ప గ రి స స రి గ ప గ రి స స రి గ ప ప గ ప గ రి గ స నా అడుగులో అడుగేసే అలకైనా అందంగుంది అరచేతిని పట్టుకునే అదృష్టం అయ్యింది నీ మాటలు వినకుండా కునుకైనా రానంటుంది నువ్వు ఎదురుగా నిలబడితే ఏదేదో అవుతుంది ఓ పలుకుల చిలకమ్మా నిను కోరిన ఈ జన్మ మాట్లాడే సిరి బొమ్మ నా బతుకంతా నీకమ్మా కుదురుగ నేనుండనులే నిను కలిసే వరకూ కాలాన్నే ముందుకు తోయన నా చెలి నీ కొరకు రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుంది తన నిదురను దోచేసే రూపం నీదయింది నీ కలువానీ కన్నుల్లోన వరుడే ఎవరమ్మా నీ బుగ్గల్లో సిగ్గులనే గెలిచాడోయమ్మా నీ తోడయ్యే వాడు ఎవరో నువ్వే సెప్పమ్మా నడి రాతీరి చంద్రుడు ఎవడయ్యడోయెమ్మా ఆ నింగిలో వెన్నెల నా గుండెకు దిగివచ్చింది వందేళ్లు నీతోనే అని వరమే ఇచ్చేసింది నా చేతిలో నీ పేరే గోరింటాకైరాసింది నీ వేలిని పట్టుకునే క్షణమే వచ్చేసింది ఆ దేవుడి సాక్షిగా పూజిస్తా దేవత గా నా మనసే మేడగా వెంటుంటానే నీడగా మనపెళ్ళి సందడిలో నే చిందులు వేస్తున్నా నీ జతనే కావాలే ఇంకో వెయ్యేళ్ళయినా రాతిరి సీకటిలో ఈ నగరమే నిదరోతుంది నా నిదురను దోచేసే రూపం తనదయ్యింది స రి గ ప గ రి స స రి గ ప గ రి స స రి గ ప ప గ ప గ రి స నువ్వు పక్కన లేకుంటే క్షణమే ఒక యుగమవుతుంది ప్రతి నిమిషం నీతోనే ఉండాలనిపిస్తుంది నువ్వు దూరంగెలుతుంటే ఎద బారంగుంటుంది నీ నవ్వుకు కారణమే నేనవ్వాలని ఉంది నీతోనే హాయిగా ప్రతిరోజూ పండగా ప్రేమిస్తా ప్రాణంగా నా ప్రపంచం నువ్వుగా మరు జన్మే నాకుంటే నీకోసం పుడతానే కాటిలో నీతోడైన సంతోషంగొస్తానే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ