Swathilo Muthyamantha

Swathilo Muthyamantha

Lv Revanth, Nadapriya, & Sai Karthik

Альбом: Bangaru Bullodu
Длительность: 4:31
Год: 2021
Скачать MP3

Текст песни

వాన వాన వచ్చెనంట
వాగు వంకా మెచ్చెనంట
తీగ డొంకా కదిలేనంటా
తట్టా బుట్టా కలిసేనంటా
ఎండా వానా పెళ్ళడంగా
కొండా కోనా నీళ్లడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి
పరవాళ్లెత్తి పరిగెత్తంగా
వాన వాన వచ్చెనంట
వాగు వంకా మెచ్చెనంట

స్వాతిలో ముత్యమంతా ముద్దుల ముట్టుకుంది
సందె వాన
సందెలో చీకటంత సిగ్గుల అంటుకుంది
లోనాలోనా
అల్లో మాల్లో అంధ లెన్నో యాలో యాల

తాకిడి పెదవుల మీగడ తరకాలు
కరిగే వేళా
మేనకా మెరుపులు ఊర్వశి ఉరుములు
కలిసెనమ్మా
కొకకు దరువులు రైకకు బిగువులు
పెరిగే వేళా
శ్రావణ సరిగమ యవ్వన ఘుమ ఘుమ
లాయనీధమ్మా
వాన వాన వల్లప్పా వాటేస్తేనే తప్ప
సిగ్గు ఎగ్గూ చెల్లప్ప కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల
స్వాతిలో ముత్యమంతా ముద్దుల ముట్టుకుంది
సందె వాన
సందెలో చీకటంత సిగ్గుల అంటుకుంది
లోనాలోనా

తుమ్మెద చురకలు తేనెల మరకలు
కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు
వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు
ముదిరే వాన
చాలని గొడుగునా నాలుగు అడుగుల
నటనే వాన
వానలొన్న సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగ
గాలి వాన గుళ్లోనా ముద్దెలే జేగంటా
నాలో రూపం నీలో తాపం యాలో యాల
స్వాతిలో ముత్యమంతా ముద్దుల ముట్టుకుంది
సందె వాన
సందెలో చీకటంత సిగ్గుల అంటుకుంది
లోనాలోనా
అల్లో మాల్లో అంధ లెన్నో యాలో యాల

వాన వాన వచ్చెనంట
వాగు వంకా మెచ్చెనంట
తీగ డొంకా కదిలేనంటా
తట్టా బుట్టా కలిసేనంటా
ఎండా వానా పెళ్ళడంగా
కొండా కోనా నీళ్లడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి
పరవాళ్లెత్తి పరిగెత్తంగా