Daripontothundu

Daripontothundu

Mamidi Mounika

Альбом: Daripontothundu
Длительность: 3:45
Год: 2025
Скачать MP3

Текст песни

ఆహా దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు
దారిద్దునా పోనిద్దునా
జోరు మీద అత్తుండు కారు మీద అత్తండు
తోలేద్దునా పోనీ ఉకుంద్దునా
దారిపొంటత్తుండు రానిద్దునా
తొవ్వ పొంటత్తుండు పోనిద్దునా
నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక
నా ఎనక పడుత్తుండు నా ముందుటుంటుండు
సంధిద్దునా వద్ద వందిద్దునా
ఇనుకుంటా పోతాండు అనుకుంటా వతాండు
బందైదునా బంధమై చూపనా

ఆహా గాలి గాలిజేత్తుండు గండమై కూసుండు
గాలిద్దునా ఇన్నీ గోలిద్దునా
రాయే పోయే అంటుండు రౌసు పెట్టుకుంటుండు
రమ్మందునా విన్నీ పొమ్మందునా
గాలి గాలిజేత్తుండు గరమైదునా
సోయి లేకంటుండు సంధుద్దునా
గాలిగాలి గాలిగాలి గాలిగాలి గాలిగాలి
గాలిగాలి చేత్తుండు గడుసుదాన్ని అంటుండు
తల తింటాడే తరమైతలే
సోయి లేకంటుండు సోపతైతాంటాండు
సోయి ఉన్నదో వీనికి సోకున్నదో

ఆహా తిప్పిచుకుంటుండు తప్పిచుకుంటుండు
ఒప్పిద్దునా విన్నీ తప్పిద్దునా
ఈడైతానంటుండు జోడైతానంటుండు
ఇరిసేద్దునా విన్నీ మరిసుందునా
తిప్పిచుకుంటుండు తింగరోడే
తప్పించుకుంటుండు తిక్కలోడే
వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి వర్రిచ్చి
వర్రిచ్చికుంటుండు జర్రాగే అంటుండు
రానియ్యడే ముందుపోనియ్యడే
ఆగమైతంటుండు అంగడైతంటుండు
ఎగైతాడో వీడేమైతాడో

ఆహా ఎట్లైతే గట్లాయే ఎంబడే ఉండోయి
వెనక రావోయి నా వెంట రావోయ్
నీ మీద మనసయింది వరసైతే కలిసింది
ఇడిసుండకొయ్ పిల్లగా మరిసుండకొయ్
నాగు పాము కోపమొడే జెర్రు పోతు పిరుకోడే
అగ్గగో అగ్గగో అగ్గగో అగ్గగో
కొమరెల్లి మల్లన్న కొలిసి మొక్కుతున్న
కంటసూడే మమ్ము జంట చెయ్యే
ఐలేని మల్లన్న ఆశతో మొక్కుతున్న
అన్ని కలిసే తొవ్వ చూపరాదే
పర్వతాల మల్లన్న పప్పతి పడుతున్న
మరవబాకే మమ్ము కలుపరాదే
ఎములాడ రాజన్న కోడినే కడుతాను
ఎంబాటుండేటోన్ని పిలవరాదే