Ringu Ringula Juttudhana

Ringu Ringula Juttudhana

Ramu Rathod

Длительность: 5:00
Год: 2025
Скачать MP3

Текст песни

రింగు రింగుల జుట్టుదాన
రంగు రంగుల బొట్టుదాన
రింగు రింగుల జుట్టుదాన
రంగు రంగుల బొట్టుదాన
నాతో వత్తవ నాతో వత్తవ
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు

చెంగు చెంగున దూకెటోడా
చెమ్కి చెమ్కీలా చూపులోడా
చెంగు చెంగున దూకెటోడా
చెమ్కి చెమ్కీలా చూపులోడా
నీతో వస్తాలే నీతో వస్తాలే
నీతో వస్తాలే నల్లగువాడవకు
అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు
నీతో వస్తాలే నల్లగువాడవకు
అరె పొద్దంతా ఉంటాలే ఏడవకు

నువ్వు పాల కంకివే నా పూల ఎంకివే
నువ్వు చాలా పెంకివే రా రా రా
నాతో వత్తవ నాతో వత్తవ
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు

సన్న సన్నని నవ్వులదాన
నున్న నున్నని నడుముదాన
అరె సన్న సన్నని నవ్వులదాన
నున్న నున్నని నడుముదాన

నాతో వత్తవ నాతో వత్తవ
నాతో వస్తావా మేడారం జాతరకు
నువ్వు కోరింది కొనిపెడతా ఏడవకు
నాతో వత్తవ మేడారం జాతరకు
నువ్వు కోరింది కొనిపెడతా ఏడవకు

అరె కురస కురస కూసలోడా
మెరిసే మెరిసే మీసాలొడా
కురస కురస కూసలోడా
మెరిసే మెరిసే మీసాలొడా
నీతో వస్తాలే నీతో వస్తాలే
నీతో వస్తాలే మేడారం జాతరకు
నే పొద్దంతా ఉంటాలే ఏడవకు
నీతో వస్తాలే మేడారం జాతరకు
నే పొద్దంతా ఉంటాలే ఏడవకు

హే సన్నంచు చీరకట్టి
పూలంచు రైక చుట్టి
నా చిన్ని యేలు బట్టి రా రా రా
నాతో వత్తవ నాతో వత్తవ
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు
నాతో వస్తావా నల్లగువాడవకు
అరె పొద్దున్నే పంపిస్తా ఏడవకు

నల్ల నల్లని కురులదాన
తెల్ల తెల్లని బుగ్గలదాన
నల్ల నల్లని కురులదాన
తెల్ల తెల్లని బుగ్గలదాన
నాతో వత్తవ పిల్ల వత్తవ
నాతో వస్తావా ఏడేడు బావులకు
అరె నేనస్సలే చెప్పను నీ బావాలకు
నాతో వస్తావా ఏడేడు బావులకు
పిల్ల నేనస్సలే చెప్పను నీ బావాలకు

ఆహా ఏడేడు బావాలకెందుకంటా
నాకున్నా బావవి నువ్వేనంటా
ఏడేడు బావాలకెందుకంటా
నాకున్నా బావవి నువ్వేనంటా
నీతో వస్తాలే అరె నీతో వస్తాలే పద పద
నీతో వస్తాలే నీ ఇంటి కోడలిగా
ఇక నువ్వేలే నా ముద్దుల మొగుడివిగా
నీతో వస్తాలే నీ ఇంటి కోడలిగా
ఇక నువ్వేలే నా ముద్దుల మొగుడివిగా

పూల బుట్ట పట్టుకొని
పాల గ్లాసు అట్టుకొని
సిగ్గులు తెగొట్టుకొని రా రా రా
నేనే వత్తలే నేనే వత్తలే
నేనే వస్తాలే నీ ఇంటి అల్లుడిగా
నీతో ఉంటాలే నీ ముద్దుల పెనీవిటీగా
నేనే వస్తాలే నీ ఇంటి అల్లుడిగా
నీతో ఉంటాలే నీ ముద్దుల పెనిమిటీగా