Indiramma

Indiramma

S P Balasubrahmanyam

Альбом: Mahathma
Длительность: 4:51
Год: 2014
Скачать MP3

Текст песни

రఘుపతి రాఘవ రాజారాం
పతీత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తెరో నాం
సబ్ కో సన్మతి దే భగవాన్
ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ

ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ

Currency note-u మీద
ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ

ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
రామనామమే తలపంతా
ప్రేమధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష
ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత
ధర్మయోగమే జన్మంతా
ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి అని ప్రకటించిన
అలనాటి కృష్ణ భగవద్గీత
ఈ బోసినోటి తాతా
మన లాగే ఓ తల్లి కన్న
మాములు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే
స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గ జ్యోతి
నవ శకానికే నాంది

రఘుపతి రాఘవ రాజారాం
పతీత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తెరో నాం
సబ్ కో సన్మతి దే భగవాన్

(రఘుపతి రాఘవ రాజారాం)
(పతీత పావన సీతారాం)
(ఈశ్వర్ అల్లా తెరో నాం)
(సబ్ కో సన్మతి దే భగవాన్)

గుప్పెడు ఉప్పును పోగేసి
నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా
ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగజ్జేత
చఱఖా యంత్రం చూపించి
స్వదేశీ సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగులను
బంధించాడురా జాతిపితా
సంకల్ప బలం చేత
సూర్యుడు అస్తమించని రాజ్యానికి
పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడి రాతిరికి
స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి
హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడు ఇలా తలంపై
నడయాడిన ఈనాటి సంగతీ
నమ్మరానిదని నమ్మక ముందే
ముందు తరాలకు చెప్పండి

సర్వజన హితం నా మతం
అంటరానితనాన్ని అంతః కలహాలనీ
అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం

హే రాం