Chandrullo Unde

Chandrullo Unde

Shankar Mahadevan

Длительность: 4:16
Год: 2005
Скачать MP3

Текст песни

చంద్రుడ్లో ఉండే కుందేలు, కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
(తందానే తందానే)
చుక్కల్లో ఉండే జిగేలు, నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా
(తందానే తందానే)
నువలా సాగే తోవంతా
నావలా తూగే నీవెంట
(ఏవంట)
నువ్వెళ్ళే దారే మారిందా
నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా

చంద్రుడ్లో ఉండే కుందేలు, కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా

ఏలే ఏలే ఏలే, ఏలే ఏలే ఏలే
ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలాలో ఏలాలో

Hi, my name is Santosh, may I know your name please
Stella
Stella
Oh, what a beautiful name
Can I have your phone number
రేయ్ రేయ్ రేయ్
Oh-oh, coming dad

గువ్వలా దూసుకువచ్చావే, తొలి యవ్వనమా
తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వుల్నే తీసుకువచ్చావే, ఈడు సంబరమా
తెలుసా ఎవ్వరికివ్వాలో

హే, గ గ గ రి గ రి స స స ని ని స
గ గ గ రి గ రి స స

ఓ, కూచిపూడి అన్న పదం, కొత్త ఆట నేర్చిందా
పాప లాంటి లేత పదం, పాఠశాలగా
కూనలమ్మ జానపదం, పల్లె దాటి వచ్చిందా
జావలీల జాణతనం, బాట చూపగా
కుంచలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా, అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా, ఇంతలా ఏవో రాగాలు

ఆకతాయి సందడిగా, ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం, ఎంతవరకో
రేపు వైపు ముందడుగా, లేనిపోని దుందుడుక
రేగుతున్న ఈ వేగం, ఎందుకొరకో
మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే, లెక్కలే మాయం అయిపోవా
రెంటిని ఒక్కటి చేసేలా, తీరమేదంటే
దిక్కులే తత్తరపడిపోవా