Nesthama Iddari

Nesthama Iddari

S.P.Balasubramanyam

Альбом: Pelli Pandiri
Длительность: 5:13
Год: 1998
Скачать MP3

Текст песни

మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
నింగి నెల నేటి వరకు ఎన్నో అందాలు చేక్కాడు
ఉహు ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే
ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె
ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి అవి ఎలా ఉంటాయి

బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు
దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది
పెదవి కొమ్మ పూసిన పువ్వు
అందమైన నీ చిరునవ్వు తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువునా పులకలు రేగిన వేళా
నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా
దిగులు రంగే హ హ నలుపు అనుకో హ హ
ప్రేమ పొంగే హ హ పసుపు అనుకో హ
భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి

మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలురేపి
ఆ కదలికే ఉదయం అనుకోమ్మా
చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే
సాయంత్రం అయినట్టేనమ్మా
నీలో నవ్వినా ఆశలు నా చెలివైతే
నేనై పలికిన పలుకులు నీ కూలుకైతే
ఇలావు నీవే హ హ రవిని నేనై హ హ
కలువ నీవే హ హ శశిని నేనే హ
ఒక్కరికోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే
నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరుంటే
ఈ కళ్ళలోన నీ కళలు ఉంటె
ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే
చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే