Goruvanka Valaga
S.P.Balasubramanyam
5:05పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్నా నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్నా తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్నా భాగ్యోదయదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృ భూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు అడుగో అరి భయంకరుడు కట్ట బ్రాహ్మణా అది వీర పాండ్య వంశాంకురా సింహ గర్జన అడుగో అరి భయంకరుడు కట్ట బ్రాహ్మణా అది వీర పాండ్య వంశాంకురా సింహ గర్జన ఒరేయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు నారు పోసావా నీరు పెట్టావా కోత కొసావా కుప్ప నూర్చవా ఒరేయ్ తెల్ల కుక్కా కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు సిస్తేన్దుకు కట్టాలిరా అని పెళ పెళ సంకెళ్లు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్నా భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్నా నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారీ వస్తున్నాడాదిగో మన అగ్గి పిడుగు అల్లూరీ అగ్గి పిడుగు అల్లూరీ ఎవడురా నా భారత జాతిని తత్వమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరు బట్టినా తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ముఁనెంచి పన్నులడిగె కొమ్ములొచించిన దమ్ములేవాడికి వచ్చేరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల తాండ్ర గొడ్డలి పన్ను గడతాది చూడరా అన్నా మన్నెం దొర అల్లూరిని చుట్టూ ముట్టి మందీ మార్బలామెట్టి మర ఫిరంగు లేక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పీల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం ఆజాదూ హిందూ ఫొఉజు దళపతి నేతాజీ అఖండ భారత జాతి కన్నా మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చేయాలని హిందూ ఫొఉజు జైహింద్ అని గడిపాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కళలు గన్న స్వరాజ్యం సాధించే సమరం లో అమర జ్యోతులై వెలిగే ధ్రువతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారత దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్నా నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి