Kalakatta Pan Esina

Kalakatta Pan Esina

Shankar Mahadevan

Альбом: Raghavendra
Длительность: 4:52
Год: 2007
Скачать MP3

Текст песни

కలకత్తా పానేసినా చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో
పొగిడి ఎక్కించకు ఇలా ములగాచెట్టు
ఒకే పిడికిలి పోటు పది పిడుగుల పెట్టు
పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే
గాలితుఫానులే అరె నీలో చుశానులే
కలకత్తా పానేసినా చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో

చాటు మాటు లేని మొగ్గలు చీర రైక లేని బుగ్గలు
అడ్డు వుంటే అందం అందునా ముద్దు మురిపెం నీకు చెందునా
హే ముద్దులుండేవి చెంపలోనా ముచ్చటైనా పెదవుల్లోనా
ఎల్లా తెలిపేది మందిలోనా ముద్దులు ఊరేది గుండెల్లోనా
ముద్దు తినిపిస్తావా లేక తాగిస్తావా
ఇచ్చి మురిపించనా మురిసి అందించనా
పోటీ బాగుందమ్మో ఇక ఆటే మిగిలిందమ్మో
ఆడుకోవాలయ్యో నేనోడి గెలవాలయ్యా
కలకత్తా పానేసినా చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకోని ముట్టుకునే ఆటలో

ఒళ్లు మొత్తం ఏదో వేడిరా ఒళ్లోకొస్తా పట్టి చూడరా
చల్లలోన కలిపి చక్కెరా కల్లోకొచ్చి ఇస్తా వెళ్లిరా
హే కొంగు సాచాను పువ్వులాగా రంగులేసి నవ్వించరా
హే హొళీ పండక్కి వచ్చి చూడే చోళీ నింపి పంపిస్తానే
వరస కలిపేందుకు వాయిదాలెందుకు
ఉరుము కావాలమ్మో వాన కురిసేందుకు
నీలో మెరుపుందయ్యో అది నాలో మెరవాలయ్యా
దసరా కావాలంటే  హయ్ దశమి రావాలమ్మో
దిల్ పత్తా తప్పింది నీ పాటలో నడుం పట్టుకొని ముట్టుకునే ఆటలో