Rama Rama

Rama Rama

Sooraj Santhosh, Ranina Reddy, & M.L.R. Karthikeyan

Альбом: Srimanthudu
Длительность: 4:21
Год: 2015
Скачать MP3

Текст песни

సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమీ సంద్రుడు

మారాజైనా మామూలోడు మనలాంటోడు

మచ్చలేని మనసున్నోడు, జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు
వాడే శ్రీరాముడు

రాములోడు వచ్చినాడురో
దాన్తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో
(దాన్తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో)
నారిపట్టి లాగినాడురో
దాన్తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో
(దాన్తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో)
ఫెళ ఫెళ ఫెళ ఫెళ్ళుమంటు ఆకశాలు కూలినట్టు
భళ భళ భళ భళ్ళుమంటు దిక్కులన్ని పేలినట్టు
విల విలమను విల్లు విరిచి జనకరాజు అల్లుడాయెరో

మరామ రామ రామ రామ రామ రామ రామ

రామదండులాగ అందరొక్కటౌదామా

(మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా)

(మరామ రామ రామ రామ రామ రామ రామ)

(మరామ రామ రామ రామ రామ రామ రామ)

రాజ్యమంటే లెక్కలేదురో
దాన్తస్సదియ్య అడవిబాట పట్టినాడురో
(దాన్తస్సదియ్య అడవిబాట పట్టినాడురో)
పువ్వులాంటి సక్కనోడురో
దాన్తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో
(దాన్తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో)
బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణం పెట్టి
పలు మలుపులు గతుకులున్న ముళ్ళ రాళ్ళ దారిపట్టి
తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో
మరామ రామ రామ రామ రామ రామ రామ

రామదండులాగ అందరొక్కటౌదామా

(మరామ రామ రామ రామ రామ రామ రామ)
(రామదండులాగ అందరొక్కటౌదామా)

రామసక్కనోడు మా రామ సంద్రుడంట
ఆడకళ్ళ సూపు తాకి కందిపోతడంట
అందగాళ్ళకే గొప్ప అందగాడట
నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా

జీవుడల్లె పుట్టినాడురో
దాన్తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో
(దాన్తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో)
నేలబారు నడిచినాడురో
దాన్తస్సదియ్య పూల పూజలందినాడురో
(దాన్తస్సదియ్య పూల పూజలందినాడురో)
పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు
పది పది తలలున్నవాణ్ణి పట్టి తాటదీసినాడు
చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో
మరామ రామ రామ రామ రామ రామ రామ

రామదండులాగ అందరొక్కటౌదామా

(మరామ రామ రామ రామ రామ రామ రామ)
(రామదండులాగ అందరొక్కటౌదామా)