Urike Urike
M.M. Sreelekha
4:36ఓహో పుత్తడీ బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్న ఓహో పుత్తడీ బొమ్మ నీకళ్ళ వాకిళ్ళలో ముగ్గులాగ ఉన్న ఓహో నీలాల నింగినే నే కళ్ళకద్దినా నీ చూపు విరుపులే వేల మెరుపులా మేఘాల తీరుగా కంటిపాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచెదనా ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఊ ఓ ఓ బోనమెత్తిన బుట్టబొమ్మలా రేగడిలో రేగుపండు నువ్వా మట్టిలోపలా పుట్టగొడుగులా ఉట్టిలో దాచుకున్న సద్దిబువ్వ ఆ పాలపిట్ట పైట దీపాల చిట్టి రైక ఓ పట్టు దారమల్లుకుంటివా ఆ పుట్టమట్టి తెచ్చి నా చేత చుట్టి చుట్టి ఓ బొమ్మలాగ చేసుకుందునా ఓహో పుత్తడీ బొమ్మ నీకన్న పెద్ద అందమే నాకు ఎందుకమ్మ ఓహో పుత్తడీ బొమ్మ ఈ జన్మతోటి సాలునే పంచుకుంటనమ్మా పచ్చి పాలలో వెచ్చ నురగలా అచ్చమైన ప్రేమలోన దించావే లేగ దూడకే మెడలో గంటలా గంటకొక్కసారి గుండె తట్టినావే మాగాణిలోని గట్టు నీ ఓని పూల జట్టు వయ్యారమంత పోత పోస్తివే నీ సోగకళ్ళ చాటు తేనల్ని దాచినట్టు నీ తీపి చూపునంత ఈయవే ఓహో పుత్తడీ బొమ్మ నీ అందమంత కళ్ళలో నింపుకొంటినమ్మ ఓహో పుత్తడీ బొమ్మ (బొమ్మా) నీ పేరు పక్క పేరునే రాసుకొంటినమ్మా